కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా 126 డివిజన్ జగద్గిరిగుట్ట శ్రీనివాస్ నగర్ బస్ స్టాండ్ వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భగతసింగ్ నగర్ మీదుగా మాక్డూమ్ నగర్ వద్ద మార్గ మద్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ చివరగా జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే తమ అమూల్యమైన ఓటు వేసి గెలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట మోచ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, 126 డివిజన్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబెర్ వన్నీర్ గణేష్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కొలన్ హన్మంత్ రెడ్డి





