న్యూ దిల్లీ, ఫిబ్రవరి 13 : తెలంగాణ అప్పులు 2.83 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ రాత పూర్వక సమాధానమిచింది. రాష్ట్రం ఏర్పడిన 2014 నాటికి తెలంగాణా అప్పు 75,577 కోట్లు వుండగా 2022 నాటికి 2,83,452 కోట్లకు అప్పులు చేరుకున్నాయని తెలిపింది. నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు రుణాలు తీసుకుంటున్నాయని పేర్కొంది.
నాబార్డ్ నుండి రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వంకు ఇప్పటి వరకు 7144 కోట్ల రుణాలు అందాయని తెలిపింది. వేర్ హౌజింగ్ ఇన్ఫాంష్ట్రస్ట్రక్చర్ ఫండ్ కింద నాబార్డ్ నుండి ఇప్పటివరకు తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు 85,227.94 కోట్ల రుణాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.




