తెలంగాణలో 43 శాతం పెరిగిన మెడికల్‌ ‌సీట్లు

మంత్రి హరీష్‌ ‌రావు ట్వీట్‌
‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణలో వైద్యారోగ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ మెడికల్‌ ‌కాలేజీలు పెరిగాయి.2023-24లో దేశంలో అందుబాటులోకి వచ్చిన మొత్తం మెడికల్‌ ‌సీట్లలో తెలంగాణ నుంచి అందుబాటులోకి వచ్చినవి 43 శాతం సీట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ ‌చేశారు.

దేశంలో అందుబాటులోకి వచ్చిన 2118 ఎంబీబీఎస్‌ ‌సీట్లలో 900 సీట్లు తెలంగాణ నుండి వచ్చినవే అని తెలిపారు. జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు ద్వారా సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను ప్రజలకు మరింత చేరువ చేసి ఆరోగ్య తెలంగాణ సాకారం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ‌సంకల్పం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *