- మహిళా వోటర్లు 1,58,43,338 కాగా పురుష వోటర్లు 1,58,71,493
- తుది వోటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
న్యూ దిల్లీ, అక్టోబర్ 4 : రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వోటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 వోట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించిన వోట్లు పోగా తెలంగాణలో ప్రస్తుతం 3,17,17,389 వోట్లు ఉన్నాయి. మొత్తం వోటర్లలో ట్రాన్స్‌జెండర్లు 2,557 మంది ఉన్నారు. సర్వీస్ వోటర్లు 15,338 మంది, ఓవర్సీస్ వోటర్లు 2,780 మంది ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు.
ఇక 3.17 కోట్లకు పైగా ఉన్న వోట్లలో మహిళా వోటర్లు 1,58,43,339 మంది ఉండగా, పురుష వోటర్లు 1,58,71,493 మంది ఉన్నట్లు వోటర్ల జాబితా స్పష్టంచేసింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం హైదరాబాద్‌కు చేరుకుని ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు, వివిధ పార్టీల నాయకులతో సవి•క్షా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఎన్నికల బృందం మూడు రోజుల పర్యటన రేపటితో ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికలపై ప్రకటన వొచ్చే అవకాశం ఉంది.





