తెలంగాణలో 12 మంది అడిషనల్‌ ఎస్పీల బదిలీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా ఎస్‌ రమేశ్‌, ఆదిలాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా సురేందర్‌ రావు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 అడిషనల్‌ డీసీపీగా రామారావు, సైబరాబాద్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీగా శ్రీనివాసులు, మెదక్‌ అడిషనల్‌ ఎస్పీగా రెహ్మాన్‌, నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీగా శివకుమార్‌ నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *