తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 ప్రజాతంత్ర కోడంగల్ అక్టోబర్ 17: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను  రేప రేప లాడిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సందర్భంగా 6 గ్యారంటీల హామీ పత్రాలను స్థానిక ఈదమ్మ దేవాలయంలో  అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహించి  ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే నవంబర్ 30 న జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో   ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే తక్షణమే హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జంగం వీరన్న, జగన్ గౌడ్,గోపాల్ గౌడ్, శేఖర్,భాస్కర్,తిరుపతి రెడ్డి, ఎస్.సాయిలు, ఆనంద్,మలే అంజి,రొయ్యలి భీంలు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *