తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రపతి రాష్ట్రానికి వొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శనివారం ఉదయం హకీంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె దిల్లీకి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *