తెలంగాణలో మలబార్‌ ‌రూ. 750 కోట్ల పెట్టుబడులు

రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరంలో మలబార్‌ ‌జెమ్స్, ‌జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు.మలబార్‌ ‌జెమ్స్ ఈ ‌కంపెనీ ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2,750 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్‌ ‌షోరూమ్స్‌ను ప్రారంభించింది. వెయ్యి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ షోరూమ్స్‌ను విస్తరించేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మలబార్‌ ‌జెమ్స్ ‌మ్యానుఫ్యాక్చరింగ్‌ ‌యూనిట్‌ ‌శంకుస్థాపన కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ జయేశ్‌ ‌రంజన్‌, ‌పరిశ్రమల డైరెక్టర్‌ ‌డీ కృష్ణ భాస్కర్‌, ‌మలబార్‌ ‌గ్రూప్‌ ఆఫ్‌ ‌కంపెనీస్‌ ‌చైర్మన్‌ అహ్మద్‌ ఎం‌పీ, వైస్‌ ‌చైర్మన్‌ అబ్దుల్‌ ‌సలాం కేపీ పాల్గొన్నారు.

  • ఆకలి సూచిలో అట్టడుగున భారత్‌
  • ‌ఫెయిల్యూర్స్‌ను అంగీకరించని బిజెపి జోకర్స్
  • ‌ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌విమర్శలు

ఆకలి సూచీలో భారత్‌ అట్టడుగున చేరింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్‌ ఇం‌డెక్స్‌లో భారత్‌ 107 ‌స్థానంలో నిలిచింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. ఎన్‌పీఏ గవర్నమెంట్‌ ‌సాధించిన మరో అద్భుతమైన విజయం ఇదేనని అంటూ కేటీఆర్‌ ‌వ్యంగ్యంగా ట్వీట్‌ ‌చేశారు. ఆకలి సూచీలో భారత్‌ 101‌వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరిందని తెలిపారు.

ఈ ఫెయిల్యూర్‌ను బీజేపీ జోకర్స్ అం‌గీకరించకుండా.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శ్రీలంక (64వ ర్యాంక్‌), ‌నేపాల్‌ (81), ‌బంగ్లాదేశ్‌ (84), ‌పాకిస్థాన్‌ (99) ‌మన దేశం కన్నా ముందున్నాయి. దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్‌ (109 ‌ర్యాంక్‌) ‌మాత్రమే భారత్‌ ‌కన్నా దిగువన ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *