తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ ‌గెలుపు

  • కాంగ్రెస్‌ ఎం‌పీ మాణికం టాగూర్‌  ‌జోస్యం
  • ఓడిపోతామని తెలిసే కవిత మహిళా రిజర్వేషన్‌ అం‌శం లేవనెత్తిందని వ్యాఖ్య

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 5 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పెద్ద మెజార్టీతో గెలవబోతుందని కాంగ్రెస్‌ ఎం‌పీ మాణికం టాగూర్‌  ‌జోస్యం చెప్పారు. దిల్లీలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మాణికం టాగూర్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే కవిత మహిళా రిజర్వేషన్‌ అం‌శాన్ని లేవనెత్తుతున్నారని చెప్పుకొచ్చారు.

బీఆర్‌ఎస్‌ను తెలంగాణ మహిళలు ఓడించబోతున్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై ఎప్పటి నుంచో గళం వినిపిస్తున్నారని..యూపీఏ ప్రభుత్వం హయాంలో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు ఆమోదం తెలిపారని గుర్తుచేశారు. సరైన సంఖ్యా బలం లేకనే యూపీఏ హయాంలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పాస్‌ ‌చేయలేకపోయామన్నారు. బీజేపీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాణికం టాగూర్‌ ‌వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *