తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 17 : తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్‌, ‌జయశంకర్‌, ‌ములుగు, భదాద్రి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. అలాగే ఉమ్మడి కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌భువనగిరి, హైదరాబాద్‌, ‌వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్‌, ‌భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం మహబూబాబాద్‌లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌, ‌మల్కాజ్‌గిరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ‌జారీ అయ్యింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్ ‌జారీ చేసింది. నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌జగిత్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ఈ మేరకు ఎల్లో అలెర్ట్ ‌జారీ చేసింది హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *