- విపక్షాలను దెబ్బతీసే కుట్ర…ప్రశాంత్ కిశోర్, బీజేపీ గేమ్ ప్లాన్
- అందులో భాగంగానే కేసీఆర్ నాటకాలు
- దిల్లీలో కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్లో రేవంత్, భట్టిల భేటీ
- రాష్ట్ర రాజకీయాలపై చర్చ
న్యూ దిల్లీ, జూలై 5 : ప్రశాంత్ కిషోర్, బీజేపీ ప్లాన్‌లో భాగంగానే సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడని రేవంత్ విమర్శించారు. పశ్చిమబెంగాల్ తరహాలో ప్రశాంత్ కిషోర్ రాష్ట్రాన్ని తయారు చేయాలని చూస్తున్నాడన్నారు. పశ్చిమ బెంగాల్లో విపక్షాలన్నీ తుడుచుకో పెట్టుకోవడానికి ప్రశాంత్ కిషోరే కారణమన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని ప్రశాంత్ కిషోర్ యత్నిస్తున్నారని అన్నారు. ఇదిలావుంటే పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం రేవంత్ విడియాతో మాట్లాడుతూ..జులై 7 నాటికి పీసీసీ అధ్యక్షుని బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి అవుతుందని..
ఈ కాలంలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్‌కి వివరించానని వెల్లడించారు. రాబోయే కాలంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. చేరికలపై అనూహ్యంగా ముందుకు వెళ్తున్నాం. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి పార్టీలో చేర్చుకుంటున్నాం. పార్టీలో చేరే వారి గురించి ముందే వి•డియాకు తెలియడం వల్ల అధికార పార్టీ వారిపైన కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందన్నారు. అందువల్లనే పార్టీలో చేరే వారిని ముందుగా వి•డియాకు తెలియనివ్వట్లేదు. హైదరాబాద్‌లో వి•టింగ్‌కు విష్ణువర్ధన్ రెడ్డి నన్ను కూడా ఆహ్వానించారు. వి•డియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తుంది. రాబోయే కాలంలో హైదరాబాదులో జిల్లా కార్యకర్తలను కలుపుకొని విష్ణువర్ధన్ రెడ్డి సభ పెడతానన్నారు. దానికి టీపీసీసీ అధ్యక్షుడిగా అన్ని అనుమతులూ ఇచ్చాను. రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు సందర్భంగా విపక్షాల విటింగ్కి కేసీఆర్ ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ సహాయం చేస్తుందని ఆరోపించారు. వారు చేస్తున్న చర్యలన్నిటికీ విరుద్ధంగా మా కార్యచరణ ఉంటుంది. పెరేడ్ గ్రౌండ్లో మొదట టీఆర్ఎస్, రెండు బీజేపీ సభ పెట్టాలి దాని తర్వాత మూడవ సభ మేము పెడతాము.
మా సభకు ఎంతమంది వొస్తారో చూడాలని రేవంత్ పేర్కొన్నారు. ఇదిలావుంటే తమ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని అంతా సద్దుమణిగిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు ఉంటాయన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ పార్టీతో ఆ పార్టీ దోస్తీ బయటపడిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విభజన చట్టంలోని హావి•లను నెరవేరుస్తారని ఆశించామన్నారు. మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ తీసుకుంటున్నచర్యలను సమర్థిస్తుందని అర్థం చేసుకోవచ్చు.


