- క్రీడా స్పూర్తితో జీవితంలో శిఖరాలలో రాణించాలి.
- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సహిస్తాం
- మంత్రి మహేందర్ రెడ్డి
పరిగి,ప్రజాతంత్ర,అక్టోబర్, 03: ప్రతిభావంతులైన క్రీడాకారులకు తెలంగాణలో బంగారు భవిత ఉంటుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిష్టించాలని ఆయన పిలుపునిచ్చారు.మంగళవారం పూడూరు మండలం మోడల్ పాఠశాలలో నిర్వహించిన 67వ జిల్లా స్థాయి బాలికల బాలికల స్కూల్ గేమ్స్ వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. అండర్ 14, 17 వయస్సు గల విద్యార్థిని, విద్యార్థులు జిల్లాలోని 18 మండలాలకు చెందిన 24 టీంలు 320 మంది క్రీడాకారులు పాల్గొన్న పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ…. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఎంతో మంది పేద విద్యార్థులు తమ ఉనికిని ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం ఉంటుందని అన్నారు.
అర్జున అవార్డు గ్రహీతలు రవికాంత్ రెడ్డి, సుహాసిని లు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన వారేనని అలాంటి వారి బాటలో నడిచి దేశ, విదేశాలలో మన రాష్ట్ర, దేశ ప్రతిష్టను చాటాలని మహేందర్ రెడ్డి సూచించారు.క్రీడలు ఉల్లాసానికి దేహదారుడ్యానికి, ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనులు భూగర్భవనరుల శాఖామంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గతంలో తాండూర్, షాబాద్ ప్రాంతాలలో జాతీయ ఆటగాళ్లతో క్రీడా పోటీలు నిర్వహి ంచామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి క్రీడాకారుని అభ్యున్నతికి ప్రభుత్వం అవసరమైనంత చేయూతనిస్తుందని మహేం దర్రెడ్డి వెల్లడించారు. వాలీ బాల్ క్రీడలను జిల్లా లోని ఆరు జోన్లకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయులు న్యాయ నిర్ణేతలుగా వ్యవ హరించి క్రీడలను నిర్వహి ంచారు. కార్య క్రమంలో మండల జడ్పిసి మేఘమాల, ఎంపిపి మల్లేశం, ఎంకేపల్లి ఎంపీటీసీ సురేందర్, సర్పంచ్ వనజ వేణుగోపాల్, ఎంఈఓ హరిచందర్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.





