తిరుమల, జూలై 12 : తెలంగాణ సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. దేశంలో ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుందన్నారు. ఉచిత విద్యుత్ అంశం బయటకు వొచ్చినప్పుడు దానిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై దేశంలో ఎవరు కూడా సాహసం చేయలేదని, అలాంటిది వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 సంవత్సరంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారన్నారు. ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులూ లేకుండా పాదయాత్ర పూర్తి చేశానని భట్టి విక్రమార్క చెప్పారు.




