- అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం
- మోటర్లకు వి•టర్లు ఉత్తుత్తి ప్రచారమే
- వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడో చూపాలి
- లేకుంటే కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవాలి
- జగిత్యాలలో కొనసాగుతున్న బండి సంగ్రామ యాత్ర
జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అవినీతి ప్రభుత్వం ఓడిపోక తప్పదని చెప్పారు. అభివృద్ధి చేసే వాళ్లే గెలుస్తారన్న బండి సంజయ్..అవినీతిపరులు పడిపోతారని తెలిపారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్ విడిది నుండి బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మొదలైంది. సిర్పూర్, నడికుడ, రాఘవపేట, హుస్సేన్ నగర్, ముత్యంపేట్ వి•దుగా వేంపేట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుండగా..వెంపెట్ సవి•పంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు. మొత్తం12.6 కిలోవి•టర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.
పదేపదే మోటర్లకు వి•టర్లు అంటూ టిఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. మోటార్లకు వి•టర్లు పెడితే తానే బాధ్యత వహిస్తానని బండి సంజయ్ అన్నారు. లేని పక్షంలో సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతికే వి•టర్లు పెట్టామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రూ.60 వేల కోట్ల బకాయిలతో డిస్కంలను సంక్షోభంలోకి నెట్టిన సీఎం…కరెంట్ ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. మైసూర్ పాక్, మైసూర్ బజ్జీ, ఇరానీ చాయ్…అక్కడి నుండే వొస్తున్నాయా? అని ప్రశ్నించారు. మేకిన్ ఇండియా పేరుతో స్థానిక పరిశ్రమల నుండే చైనా బజార్లకు వస్తువులు వెళుతున్నాయని చెప్పారు.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే ఉరేసుకుంటానన్న ఎమ్మెల్యే ఎటుపోయిండని బండి సంజయ్ ప్రశ్నించారు. రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు డబ్బులివ్వరా అని అడిగారు. లక్ష కోట్లతో దొంగ సారా దందా చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని బండి సంజయ్ హావి• ఇచ్చారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తానన్న హావి• ఏమైందని అడిగారు. గల్ఫ్ బాధితుల శవాలను కూడా తీసుకురాలేని అసమర్థులు అంటూ విమర్శలు చేశారు. వేములవాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలకు వందల కోట్ల మంజూరు హావి• ఏమైందని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. మళ్లీ కొండగట్టు అంజన్న పేరుతో దేవుళ్లకే శఠగొపం పెడతున్నారని ఆరోపించారు. బీడీ కార్మికుల బాధలెందుకు పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్లకు కటాఫ్ డేట్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రానివే అని బండి సంజయ్ చెప్పారు.




