తెలంగాణకు వరప్రదాయిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల

  • నేడు నార్లపూర్‌ ‌వద్ద వెట్‌రన్‌ ‌ప్రారంభం..జాతికి అంకితం ఇవ్వనున్న సీఎం కేసీఆర్‌
  • 67.67 ‌టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో ఆరు రిజర్వాయర్ల నిర్మాణం
  • కాళేశ్వరం రికార్డును మించి 145 మెగావాట్ల సామర్ధ్యం గల మహా బాహుబలి మోటార్ల ఏర్పాటు
  • ఎత్తిపోతలతో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు…1220 గ్రామాలకు  తాగునీరు  సాకారం కాబోతున్న పాలమూరు ప్రజల కల
హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 15 : ‌పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణకు వరప్రదాయినిగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణాలోని చాలా జిల్లాలకు సాగునీరు, తాగునీరు సమస్య తీరుతుంది. ఒకప్పుడు పాలమూరు పేరు వింటేనే  కరువు, కాటకాలతో తల్లడిల్లే ప్రాంతమని..సాగు..తాగు నీరు లేక భూములన్నీ బీడు వడి నెర్రలు బారీ, పంటలు పండక రైతులు, ప్రజలు జీవనోపాధి కోసం వలసలు వెళ్లేవారని చెప్పుకునేవాళ్ళం. అయితే..అది గతం. మరి ఇప్పుడు…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌ప్రతిష్టాత్మకంగా తీసుకుని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేతుల మీదుగా, నార్లాపూర్‌ ఇం‌టెక్‌ ‌వద్ద వెట్‌ ‌రన్‌ ‌ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నారు. దశాబ్దాల కాలంనాటి నుండి వేచి చూస్తున్న, దక్షిణ తెలంగాణ వాసులకు, రైతాంగానికి ఇది ఒక గొప్ప పండుగల భావిస్తున్నారు.
ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఉన్నటువంటి బాహుబలి 145 మెగా వాట్ల సామర్థ్యం మోటార్లతో, ఆసియాలోని అతి పెద్దదైన సర్జి ఫుల్‌ ‌పంపులతో, కృష్ణమ్మ జలాలను ఎత్తిపోయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా వ్యవసాయ భూముల్లో, కృష్ణమ్మ పరవళ్ళు తొక్కనుంది. దీంతో పాలమూరు జిల్లా పచ్చదనంతో సస్యశ్యామలం కానుంది. ఉమ్మడి మహబుబ్‌ ‌నగర్‌ ‌తెలంగాణ రాష్ట్రంలోనే  అతిపెద్ద జిల్లా.  35 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యమైన భూములు ఈ ప్రాంతంలో  ఉన్నాయి. ఈ జిల్లా మీదుగానే కృష్ణమ్మ, తుంగభద్ర ఇంకోపక్క దుందుభి నదిలు ప్రవహిస్తాయి. అపారమైనటువంటి నీటి వనరులు ఉన్నా కానీ, ఈ ప్రాంతంలో  పంటలు పండించేందుకు సాగు నీరు అందేది కాదు. గత పాలకుల నిర్లక్ష్యానికి పాలమూరు కరువుకు కాటకాలకు నిలయంగా మారింది. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక జీవో నెంబర్‌ 105 ‌ద్వారా, జూన్‌ 10‌వ తేదీ 2015 సంవత్సరం తాత్కాలిక అంచనా రూ. 35 వేల 200 కోట్లు..పరిపాలన అనుమతులతో ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన ఈ  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాలకు  ఇప్పుడు 12.30 లక్షల ఎకరాల సాగు, 1226 గ్రామాలకు తాగు నీరు అందబోతుంది.
రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌ ‌కర్నూల్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నారాయణ్‌ ‌పేట, రంగారెడ్డి, వికారాబాద్‌, ‌నల్గొండ జిల్లాలకు ప్రధానంగా లబ్ధి చేకూరుతుంది. 67.67 టీఎంసీల నీటి నిల్వ  సామర్థ్యంతో  ఆరు రిజర్వాయర్లు నిర్మించారు. 4 పంపు హౌజ్‌ ‌లలో 145 మెగావాట్ల విద్యుత్‌ ‌సామర్థ్యం కలిగిన 34 పంపులను ఏర్పాటు చేశారు. ఏదుల పంప్‌ ‌హౌజ్‌ ‌వద్ద ఆసియాలోనే అతి పెద్దదైన సర్జ్ ‌పూల్‌ను నిర్మించారు. అత్యధిక సామర్థ్యం గల మహా బాహుబలి మోటార్లు వినియోగిస్తున్నారు. ప్రపంచంకలోనే ఎక్కడా వినియోగించని విధంగా మూడు పంపు హౌజ్‌లలో 145 మెగా వాట్ల భారీ సామర్థ్యం కలిగిన 9 పంపులను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా  వెనుకబడిన జిల్లాలు 9 ఉన్నాయి. అందులో ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా ఒకటి ఉందంటే..ఎంత దుస్థితి, దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాలమూరు ప్రజల గోస అంతా ఇంత కాదు. అది గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌  ‌పాలమూరు దశ మార్చేందుకు, పసిడి పంటలు పండించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని  రూపొందించారు.
ఈ పథకం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుండి, నార్లాపూర్‌, ఏదుల వట్టెం, కరువేనా, ఉదండాపూర్‌  ‌రిజర్వాయర్ల తో  నీటిని ఎత్తిపోసేందుకు  4 పంపింగ్‌ ‌స్టేషన్‌లో ప్రభుత్వం 21 ప్యాకేజీల కింద విభజించారు. అందులో నార్లాపూర్‌ ‌నుండి ఉదండాపూర్‌ ‌వరకు 18 ప్యాకేజీల పనులను చేపట్టడం జరిగింది.  నార్లాపూర్‌ ఏదుల పంపు హౌస్‌ ‌పనుల్లో దాదాపు 90 శాతం పైగా పంపుల అమరిక పక్రియ పూర్తి స్థాయిలో పనులు జరిగాయి. నార్లాపూర్‌ ఏదుల వట్టెం పంప్‌ ‌హౌస్‌ల పనులు తుది దశకు చేరుకున్నాయి. నార్లాపూర్‌ ‌పంపు హౌస్‌ ‌వద్ద అమర్చినటువంటి మొదటి పంపు ఈ నెల మూడవ తేదీన సంబంధిత శాఖ అధికారులు నిర్వహించిన డ్రై రన్‌ ‌విజయవంతమవడం విశేషం. ప్రభుత్వ అధికారుల నివేదిక ప్రకారం…రాబోవు 50 రోజుల వ్యవధిలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా, ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌రంగారెడ్డి జిల్లాలోని ఆరు జిల్లాలలో, 70 మండలాలు, 1226 గ్రామాలకు తాగునీరు, 12.30 లక్షల ఎకరాలకు, సాగునీరు అందించే విధంగా ముమ్మరంగా పనులు చేపట్టారు.
2015 సంవత్సరం జూన్‌ 11 ‌న మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా భూత్పూర్‌ ‌కర్వేనా వద్ద, సీఎం కేసీఆర్‌ ‌పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్‌ ఆవిష్కరించి శంకుస్థాపన చేయడంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏర్పడింది. 35200 కోట్లు తాత్కాలిక అంచనా బడ్జెట్‌తో మొదలుపెట్టారు. ఆరు రిజర్వాయర్లు, 5 ఎత్తిపోతలతో ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం మాత్రం ఐదు రిజర్వాయర్లతో నాలుగు ఎత్తిపోతలలో పనులను చేస్తున్నారు.మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లా, పరిశ్రమల సాగు, తాగు నీరు కోసం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్‌ ‌నుండి కృష్ణ నది జలాలను, 60 రోజుల్లో 90 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసేలా పథకం రూపొందించారు. వీటిని ఫేస్‌ ‌వన్‌ ‌ఫేస్‌ ‌టు భాగాలుగా విభజించారు. ఫేస్‌ ‌వన్‌లో శ్రీశైలం రిజర్వాయర్‌ ‌ముందు భాగం నుండి, కృష్ణ నీటిని ఆరు జిల్లాలోని, 70 మండలాలు, 1226 గ్రామాలకు, తాగు నీరు అందించేందుకు ఫేస్‌ ‌టు శ్రీశైలం రిజర్వాయర్‌ ‌బ్యాక్‌ ‌వాటర్‌ ‌నుండి, 12.30 లక్షల ఎకరాలకు, సాగునీరు అందించనున్నారు. ప్రస్తుతం 5 రిజర్వాయర్లతో నాలుగు పంపింగ్‌ ‌హౌసులు పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
రిజర్వాయర్‌ ‌స్థూల సామర్థ్యం 67.67 టీఎంసీలు. పంపుల గరిష్ట సామర్థ్యం 145 మెగావాట్లు. కాలువల మొత్తం పొడవు 30. 415 కిలోమీటర్లు. టన్నల్‌ ‌సొరంగం పొడవు 95. 7.774 కిలోమీటర్లు.  ప్రతి పంపు కెపాసిటీ 85 క్యూ మ్యాక్స్ ‌లు . నార్లాపూర్‌ ‌మొదటి రిజర్వాయర్‌ అం‌జనగిరి  నీటి నిలువ సామర్థ్యం 6.40 టీఎంసీలు.  కాలువ 8.325 కిలోమీటర్లు. ఏదుల  వీరాంజనేయ రిజర్వాయర్‌ 6.5 5 ‌టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్‌ 16.74 ‌టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం,12.05 కిలోమీటర్ల కాలువ. కరివేన రిజర్వాయర్‌ 19.0 ‌టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం. ఉదండాపూర్‌ ‌రిజర్వాయర్‌ 16.03 ‌టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం. ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని ఆరు జిల్లాలకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. జిల్లాల వారీగా ఆయకట్టు వివరాలోకి వెళితే..   నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా 1.03 లక్షల ఎకరాలు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా 2.35 లక్షల ఎకరాలు. నారాయణపేట జిల్లా 1.6లక్షల ఎకరాలు. వికారాబాద్‌ ‌జిల్లా 3. 41 లక్షల ఎకరాలు. రంగారెడ్డి జిల్లా 3.59 లక్షల ఎకరాలు. నల్గొండ 0.29 లక్షల ఎకరాలు. 27,047 ఎకరాల భూ సేకరణ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరం. ఇప్పటివరకు 26,872 ఎకరాల భూసేకరణ జరిగింది.175 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *