తెలంగాణకు బిఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉంది బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారనీ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం మల్లాపూర్ డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీలో మొహిన్ బాయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది మైనారిటీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.  బండారి లక్ష్మారెడ్డి  వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూతెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారన్నారు. తెలంగాణకు బిఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉందని  నమ్మి పార్టీలో చేరుతున్నారన్నారు.బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఓటర్లకు సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోని స్పష్టంగా వివరిస్తూ,  బిఆర్ఎస్ సైన్యం భారీగా ప్రచారం చేయ్యాలన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరే దిశగా అందరు కలిసి కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, కొన్ని సంవత్సరాలుగా  కష్టపడి పనిచేస్తున్న తమకు పార్టీలో సముచిత స్తానం లేకపోవడంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు , కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వంలో పనిచెయ్యడానికి  పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.ఈ  కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, కటార్ల భాస్కర్, అమాలిశ్రీను, ఎస్.వి. శివకుమార్, మహ్మద్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *