- రాజపక్సెకు పట్టిన గతే పడుతుంది
- తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం
- మిడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్ ఫైర్
- దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు ముందుకు రావాలని సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణకు పట్టిన శని కెసిఆర్ అంటూ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని రాజేందర్ సవాల్ విసిరారు. గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఎన్నికల్లో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మిద పోటీ చేస్తానని అన్నారు. బిజెపి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని ఆయన అన్నారు. మా అమ్మనాకు సంస్కారం నేర్పించిందని చెప్పారు. రాజపక్సే లాగా నిన్ను తెలంగాణ ప్రజలు పారద్రోలడం ఖాయమని అన్నారు. సోమవారం ఆయన మిడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను బొందపెట్టేది తానేనని సవాల్ విసిరారు. తెలంగాణకు పట్టిన శనిని వదిలించటమే తన లక్ష్యమని ప్రకటించారు. డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని చెప్పారు.
నా తల్లి నాకు సంస్కారం, తెలంగాణ సమాజం సహనాన్ని ఇచ్చింది. హుజురాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇచ్చారు. కేసీఆర్ చెప్పే మాటలు, చేసే పనులకు పొంతన లేకపోవడంతో నాపై కక్ష కట్లారు. నాలాంటి వారు కేసీఆర్‌కు నచ్చలేదు. ఆయనకు కావాల్సింది బానిసలు. అసెంబ్లీలో నా ముఖం కన్పించకుండా ఉండేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. పోలీసులు లేకుండా రావాలన్న నా భార్య సవాల్‌కు.. కేసీఆర్ సచ్చిపోవాలి. 50 శాతమున్న బీసీలకు 3 మంత్రి పదవులా..గిరిజనులకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు?. నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు.
తన్ని తరిమికొడతాం అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన బలం, బలహీనత, భయం అన్ని తనకు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్ దుర్మార్గమైన పాలన అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్ కళ్లు బైర్లు కమ్మి.. మతి భ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్‌కు కావాల్సింది బానిసలని.. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. కేసీఆర్ ఏ పథకం తెచ్చినా.. ఆయన బంధువులకు మాత్రమే లబ్ది చేకూరుతుందని ఆక్షేపించారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే కేసీఆర్‌కు ఉండదన్నారు. కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని.. నాయకులు కాదని ఈటల స్పష్టం చేశారు. ‘కెసీఆర్ దగ్గర లక్షల కొద్ది డబ్బులు జమయ్యాయి. కేసీఆర్ నన్ను టార్గెట్ చేశారు. బెంజ్ కార్లు ఉన్నవారికి రైతు బంధు ఇస్తున్నారు.
ఇటువంటి వాటిపై ఆడిగినందుకే అందుకే నన్ను బయటికి పంపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వోటుకి నోటు ఇచ్చి కొనుగోలు చేశారు. కేసీఆర్ గురించి అన్నీ తెలిసిన వ్యక్తిని నేనే. తెలంగాణ ప్రజలకు పట్టిన శనిని వదిలించాలి. ఒక మైనార్టీని, దళితబిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత భాజపాది. ఇప్పుడు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ప్రకటించింది. నరేంద్రమోదీకి దేశ ప్రజలే కుటుంబసభ్యులు. కేసీఆర్ బాషా ప్రసంశనీయంగా ఉందా.. తెరాస మంత్రులు గుండె మిద చేతులు వేసుకుని చెప్పండి. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్.. తప్పకుండా ఎన్నికలు పెడతారు. వర్షం పట్ల ఇబ్బందులపై ప్రెస్‌వి•ట్ పెడతారనుకున్నా. కానీ.. కుర్చీ కోసం పెట్టారు. వ్యక్తిగతంగా మాట్లాడితే ప్రజలు తన్ని తరిమేస్తారు. దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో చర్చకు రావాలి.. బూతు పురాణంతో కాదని ఈటల రాజేందర్ అన్నారు.




