తాంత్రికుడి సలహాలు పూజలతోనే పార్టీ
నల్లపిల్లితో పూజలు చేయిస్తున్న కెసిఆర్
ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు బిజెపిదే
డియా సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు
మోహన్ భగవత్‌పై కెటిఆర్ వ్యాఖ్యలపై లక్ష్మణ్ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఓ స్వాజీ సూచనల మేరకే తాంత్రిక పూజలు చేసి తాంత్రికుడి సూచనతో కేసీఆర్ పార్టీ మార్చారని వ్యాఖ్యానించారు. మునుగోడులో తెరాస గెలవాలని సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. మునుగోడులో భాజపా విజయం ఖాయమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భాజపా ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికకు భాజపా అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో డియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని ఓ స్వాజీ చెప్పినట్లు వెల్లడించారు. కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని స్వాజీ అన్నారని తెలిపారు. తాంత్రిక పూజలు చేసి తాంత్రికుడి సూచనతో కేసీఆర్ పార్టీ మార్చారని వ్యాఖ్యానించారు. మూడు నెలలకొకసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు.. ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు చేసి ద్రవాలు కాళేశ్వరంలో కలిపారని..
మూడు నెలలకొకసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తారని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వప్రయోజనాల కోసం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. మలక్‌పేట నియోజక వర్గానికి చెందిన తెరాస నేత లింగాల హరిగౌడ్ తన అనుచరులతో కలిసి భాజపాలో చేరారు. వీరికి సంజయ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. లిక్కర్‌స్కాంపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు నోరుమెదపటం లేదన్న బండి… ఇష్టానుసారంగా దోచుకుంటే ఈడీ చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. దేశంలో సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్… తాంత్రికుడి మాటలు విని కొత్త సచివాలయ భవనం నిర్మిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫౌంహౌజ్‌లో కేసీఆర్.. నల్ల పిల్లితో తాంత్రిక పూజలు చేయిస్తారన్నారు. కేసీఆర్ ఆలోచనలు మార్చుకుని పాలన కొనసాగించాలని బండి సంజయ్ సూచించారు.
తెరాస, మజ్లీస్ కలిసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మజ్లీస్ పార్టీ చట్టాలను గౌరవించడం లేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని బండి అన్నారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మోహన్ భగవత్‌పై కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మజ్లీస్ వైపు చూసే సాహసం.. కేసీఆర్ కూడా చేయలేరని అన్నారు. రాష్ట్రంలో మజ్లీస్ నేతల ఆగడాలు ఎక్కువ య్యాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.



