బళ్లారి, జులై 25 : ఆంధ్ర, కర్ణాటక రైతుల జీవనాడి తుంగభద్ర జలాశయం లోకి సోమవారం మరో నాలుగు టీఎంసీల నీరు చేరింది. తుంగభద్ర పరీ వాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ ఫ్లో 64వేల క్యూసెక్కులకు పెరిగింది. తుంగ జలాశయం నిండగా, తుంగనుంచి ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో మరో వారంలోగా రిజర్వాయర్ నిండవచ్చని బోర్డువర్గాలు అభిప్రాయ పడుతున్నారు.



