తీవ్ర వాయుగుండం మారిన తుపాన్‌

  • గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్‌’..
  • ‌తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు
  • తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలు
  • ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్‌

అమరావతి, డిసెంబర్‌ 8 : ‌నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు వైపు దూసుకు వస్తోంది. కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోటర్లు, చెన్నై 620 కిలోటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ ‌తీరప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలిన తెలిపారు. సైక్లోన్‌ ‌మాండస్‌ ‌దూసుకు రావడంతో ఇప్పటికే తమిళనాడు తీరం అలర్ట్ అయింది. సముద్రతీరంలో వాతావరణం మారిపోయింది. వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించింది స్టాలిన్‌ ‌సర్కారు.ఎన్డీఆర్‌ఎఫ్‌  ‌బలగాలను కూడా అక్కడకు రప్పించారు.మాండూస్‌ ‌తుఫాను తన పరిధిని పెంచుకుంటూ బలంగా దూసుకొస్తోంది.

ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గర్లో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట – పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం. తుపాను కదలికలకు సంబంధించిన చిత్రాలను భారత వాతావరణ శాఖ అధికారులు విడుదల చేశారు. దీని ప్రభావం వల్ల ఉత్తర తమిళనాడుతోపాటూ.. రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోటర్లు, చెన్నై 620 కిలోటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తుపాను నేపధ్యంలో కామన్‌ అలర్ట్ ‌ప్రోటోకాల్‌ ‌ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లోని ప్రజలకు అమరావతి ఐఎండీ హెచ్చరిక సందేశాలు పంపింది. తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అదికారులు. తుపాను తీరం దాటే సమయంలో 65-85 కి వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

ఈ తుపాను ప్రభావంతో మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశరం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ ‌జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుపానుకు ’మాండూస్‌’‌గా నామకరణం చేశారు. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోటర్లు, చెన్నై 620 కిలోటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశరం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ ‌జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు.

మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుపాను, భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలను నియమించారు. శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది. తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కాగా, 10 ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు తమిళనాడులోని ప్రభావిత జిల్లాలకు ముందస్తుగానే చేరుకున్నాయి. తిరువారూర్‌, ‌నాగపట్నంలో విద్యాసంస్థలు బంద్‌ ‌ప్రకటించారు. పుదుచ్చేరి, కరైక్కాల్‌లో తీరం కోతకు గురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *