తిరువనంతపురం, ఫిబ్రవరి 24 : కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కోజికోడ్ లోని కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారం.ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 182 మంది ప్రయాణికులతోకాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో విమానం రన్‌వేను ఢీ కొట్టింది. దీంతో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే విమానాన్ని తిరువనంతపురంకు మళ్లించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో నిండుగా ఉన్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు.
తర్వాత మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారణంతోనే తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.కేరళ రాష్ట్రం నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని దారి మళ్లించారు. కోజికోడ్ లోని కాలికట్ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్కు 182 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం బయలు దేరింది. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పైలట్‌ను తిరువనంతపురం వైపు దారి మళ్లించారు. 168 మంది ప్రయాణికులతో కాలికట్ నుంచి సౌదీ అరేబియా లోని దమ్మాన్ వెల్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక సమస్యలకారణంగా తిరువనంతపురం వైపు దారి మళ్లించబడింది’ అని ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.



