పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నిరంతరం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.




