తాండూరులో ప్రజాభవన్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి
 పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దంపతులు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీగా హాజరైన పార్టీ శ్రేణులు.

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా తాండూర్ లొ ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే బుయ్యాన్ని మనొహర్ రెడ్డి ప్రారంభించారు. శుక్రవారం ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దంపతులు క్యాంపు కార్యాలయంలో  ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరిగిందని, మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సహాకారంతో నియోజకవర్గ ప్రజలకు ప్రజలు మెచ్చే విధంగా పాలన అందిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజా భవన్ లో విన్నవించుకోవచ్చన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, రాంచంద్రారెడ్డి, రమేష్, మహిళ నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *