వార్ మెమోరియల్ వద్ద యువత నిరసన
చెన్నై,జనవరి16: సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. రోజుకో రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీంపై అన్ని ప్రాంతాల అభ్యర్థుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్న బిహార్ లో.. నిన్న సికింద్రాబాద్ లో అలజడులు సృష్టించిన యువత.. నేడు తమిళనాడులోనూ వార్ మెమొరియల్ వద్ద నిరనస చేపట్టారు. నిన్న, మొన్న ఆందోళనకారులు సృష్టించిన అలజడులతో పలు రైళ్లు బూడిదయ్యాయి. బస్సులు ధ్వంసమయ్యాయి. మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. కొందరికి గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరొకరికి మృతి చెందారు. ఇప్పుడు ఈ నిరసన సెగలు తమిళనాడునూ వ్యాపించాయి. అక్కడా అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి.. నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారుల దే కసరత్తులు చేస్తూ.. అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళన చేస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే కొనసాగితే.. అగ్నిపథ్ మంటలు రోజుకో రాష్టాన్రికి పాకి… దేశం అల్లకల్లోలం అవుతుందే మోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం..
కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్ బెహరా(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో పయనమయ్యారు. అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలోనే నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారు.




