- ఎల్‌అండ్‌టి ప్రతినిధులతో ‘మేడిగడ్డ’పై మంత్రి ఉత్తమ్ సమావేశం
- నాసిరకం పనులపై ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయంలేదని ఎల్‌అండ్‌టి తప్పించుకోలని చూస్తే ఊరుకునేది లేదని, అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకంగా, ఏ మాత్రం నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్‌అండ్‌టి ప్రతినిధులపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీకి సంభంధించిన పనులపై డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎల్‌అండ్‌టి ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ సమావేశం అయ్యారు. ఈ సందర్బగా ఆయన మాట్లాడుతూ…ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూటిపోవడానికి కారణమైన ఎవ్వరినీ వొదిలిపేెట్టేది లేదని స్పష్టం చేశారు.
మేడిగడ్డ ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. ఇదే సందర్భంలో అన్నారం, సుందిల్ల బ్యారేజీలను కట్టిన ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. తప్పు చేసిన వారు తప్పించేకోవాలని చూస్తే చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని మంత్రి హెచ్చరించారు. అయితే మేడిగడ్డ కుంగుబాటుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు, వాస్తవాలను తేల్చేందుకు జ్యూడిషియల్ విచారణ జరిపించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది.




