తండ్రి లేని ఆడబిడ్డ  పై చదువు కొరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేయూత

  ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన చర్ల సునీత భర్త చర్ల మధుసూదన్ రెడ్డి మృతి చెందారు. వారి కూతురు సిరిని  బీటెక్ ఫస్టియర్ ఏవీ ఎన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతుంది. చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక ఎంపీటీసీ అంబాజీ ఉపసర్పంచ్ అజీజ్ చర్ల కృష్ణ రెడ్డి లు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ఉప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ. 25, వేల చెక్ సిరి తల్లికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసి అంబాజీ, మాజి ఎంపిటిసి జి. శ్రీనివాస్ మూర్తి,  ఉప సర్పంచ్ అజీజ్, నాయకులు చర్ల వెంకట్ రెడ్డి, బి. నర్సింలు, పి. అశోక్, వి. రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *