డ్రగ్స్ – డ్రీమ్స్

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

ఉక్కు సంకల్పపు యువత
రేపటి తరపు దేశ భవిత
వివేకానంద అమృత వచనాలు
అబ్దుల్ కలాం అంతరిక్ష స్వప్నాలు
నల్లమందు ఆకాశపు
మత్తులో ఎగిరిపోతున్నాయి
గంజాయి స్వరం ఓ గన్ లా మారి
మానవతా విలువల్ని మట్టిలో కలిపేస్తుంటే
మాదక ద్రవ్యాల వాడకం
మరణశాసనాలను లిఖిస్తున్నాయి
డ్రగ్స్ డ్రీమ్స్ మత్తు, రాకెట్ల మోత
మరో ప్రపంచయుద్ధమై
మా’నవ’ ఉనికినే ప్రశ్నిస్తుంటే
అక్షరసైన్యంతో అలుపెరగని పోరాటానికి
అడుగేసాను నేను
బాధ్యత పరిమళం సాక్షిగా
మరో సుందర ప్రపంచం కోసం
మాదక ద్రవ్యాల వాడకపు పాఠాలు
పర్యవసానపు గుణపాఠాలు
కవన కిరణాలై ప్రజ్వరిల్లాలి
ప్రభుత్వాల డ్రగ్స్ నిరోధక
చర్యలు జ్ఞాన కిరణాలై
మన బ్రతుకును నడిపించే
ప్రభాత గేయాలవ్వాలి
ఇప్పటికైనా మనమంతా ఏకమై
అడుగు అడుగు ఉద్యమమై
అక్షరం అక్షరం విప్లవమై
తరాల మనుగడకోసం తరలిరాకపోతే
భూగోళమే డ్రగ్స్ చుట్టూ
పరిభ్రమిస్తుంటుంది
మనలో మనకొరకై
డ్రగ్స్ రహిత నవసమాజపు
జాతిగీతమై ప్రవహిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *