డీ లిమిటేషన్‌ ‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..!

దేశ జనాభాకు అనుగుణంగా పార్లమెంట్‌, అసెంబ్లీ సీట్లు ఎప్పుడో పెరగాల్సి ఉంది. కానీ ఈ సీట్లు పెరగడం లేదు. సరికదా కేంద్రంలో పాలన చేసిన పార్టీలన్నీ కాలయాపన చేస్తూ వొచ్చాయి. సీట్లు పెరిగితే తమకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న ఆలోచనలో పాలక పార్టీలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కత్తి ద సాములాంటిది. ఇది ఎన్నో కీలక రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. దీనికితోడు జనాభా కూడా పాపం పెరిగినట్లు పెరుగుతోంది. జనాభా కంట్రోల్‌ ‌చేయడంలో కొన్ని రాష్ట్రాలు బాగా కృషి చేస్తుంటే..బీహార్‌, ‌బెంగాల్‌ ‌వంటి రాష్ట్రాలు  అస్సలు పట్టించుకోవడం లేదు. అంతెందుకు గణాంకాల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పట్టించుకోలేదు. దక్షిణాదిలో జనాభా నియంత్రణ కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ఈ క్రమంలో అక్కడ డీలిమిటేషన్‌ ‌జరిగితే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని ఇతర రాష్ట్రాలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో కృషి చేస్తున్న తమకు అన్యాయం జరిగేలా ఉందని ఇటీవల తెలంగాణ మంత్రి కెటిఆర్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల పంపిణీలో అన్యాయం జరుగుతుందని కూడా అన్నారు.
నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయం. కేరళ లాంటి రాష్ట్రాలు అక్షరాస్యత,జనాభా నియంత్రణలో ముందున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దేశ జనాభా 140 కోట్లకు చేరినందున వారికి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య కూడా పెరగాలని కోరుకుంటున్నారు. అందుకే జనాభా ప్రాతిపదికన విభజించి 846 నియోజకవర్గాలు చేయాలన్న ఆలోచన ఉంది. అలా చేస్తే..  ఒక్క యూపీకే 143 లోక్‌ ‌సభ సీట్లు వొ స్తాయి.  మొత్తం దక్షిణాదికి 160  వరకూలోక్‌ ‌సభ సీట్లు ఉంటాయి. అంటే…  మొత్తం దక్షిణాది అంతాకూడా యూపీతో పోటీపడదన్న మాట. దీంతో పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల  ప్రాబల్యం తగ్గిపోవడం ఖాయం అన్న ఆందోళన మరోవైపు వెన్నాడుతోంది.  అందుకే దక్షిణాది రాష్ట్రాలు  నియోజకవర్గాల పునర్వి భజనకు జనాభాను ప్రాతిపదికగా తీసుకోకూడదని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. దేశంలో జనాభాను నియంత్రిం చడంలోనే కాకుండా మానవ అభివృద్ధి సూచికల్లో కూడా దక్షిణాది రాష్ట్రాలు  అగ్రస్థానంలో ఉన్నాయి.
జనాభా లెక్కల ఆధారంగా చేసే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కత్తి దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతోంది. మహిళా రిజర్వేషన్‌బిల్లు ఆమోదించిన తరువాత జరిగే తొలి జనగణన తరువాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి.. మహిళా రిజర్వేషన్‌లను అమలు జరుపుతామని లోక్‌సభలో కేంద్రం ప్రకటించింది. దీంతో.. మళ్లీ నియోజక వర్గాల పునర్విభజన అంశం తెరదకు వొచ్చింది. జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని ఇప్పటికే అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.  ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి.  జనాభా లెక్కలు తీసిన తర్వాత  పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోతుంది.  ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌బీహార్‌ ‌రాష్టాల్ల్రో లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగుతుంది.  ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుంది.
పశ్చిమబెంగాల్‌, ఒడిషా కూడా భారీగా నష్టపోతాయి.  ప్రసుతం ఈ రెండు రాష్ట్రాలకు కలిపి 42 లోక్‌సభ స్థానాలుంటే.. కొత్తగా జరిగే పునర్విభజన తరువాత వాటి సంఖ్య 34కు పడిపోయే అవకాశం ఉంది.  జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు జరిపినందుకు దక్షిణాది రాష్ట్రాలు  దారుణంగా నష్టపోతుండగా.. జనాభా నియంత్రణలో పూర్తిగా విఫలమై.. జనభా విస్ఫోటంతో నానా అవస్థలు పడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు  మాత్రం లబ్ధి పొందడం దారుణం కాకా మరోటి కాదు. ఇదే విషయాన్ని కెటిఆర్‌ ‌లెక్కలతో సహా విరించి..జరుగబోతున్న నష్టాన్ని ప్రజల ముందుంచారు.  దక్షిణాది రాష్ట్రాల  నేతలు కూడా ఇదే విషయంపై మండిపడుతున్నారు.  నియోజకవర్గాల పునర్విభజనకు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకూడదని ఈ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ ‌కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే నియోజకవర్గాల పునర్విభజ నలో దక్షిణాది రాష్ట్రాల కు ఎలాంటి నష్టం వాటిల్లదని హా ఇవ్వాలంటూ తమిళనాడు సిఎం స్టాలిన్‌ ‌ప్రధాని మోదీ•ని డిమాండ్‌ ‌చేసారు.  కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల  బిల్లును తీసుకు వచ్చిన సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన తరవాత అమలు చేయడం అని అందులో షరతు పెట్టింది. దీంతో  ఈ నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చింది.
ఇదే జరిగితే  దక్షిణాది పరిస్థితి ఏమిటన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. దేశంలో జనాభా పెరిగిపోతోందని  జనాభా నియంత్రణను మన ప్రభుత్వాలు చేపట్టాయి. జనాభాను నియంత్రించిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు  మెరుగ్గా ఉన్నాయి. ప్రజలు చిన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా  దక్షిణాదిలో జనాభా పెరుగుదల నిష్ఫత్తి తగ్గింది. అభివృద్ధిలో ముందుకు వెళ్లింది. కానీ ఉత్తరాదిలో జనాభా పెరుగుదల నిష్పత్తి తగ్గలేదు… అక్కడి ప్రజలు జనాభా నియంత్రణ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జనాభా ప్రకారం డీలిమిటేషన్‌ ‌జరిగితే.. నష్టపోయేది దక్షిణాది. లాభపడేది ఉత్తరాది. ఈ అన్యాయన్ని ఎలా సరిచేస్తారన్నదే ఇప్పుడు దేశం ముందున్న ప్రశ్న.
– ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *