డివిజన్ లోని సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ బొంతు శ్రీదేవి

ఉప్పల్ ,ప్రజాతంత్ర, జూలై 19: డివిజన్ లోనీ సమస్యలను పరిష్కారానికి దశల వారీగా కృషి చేస్తానని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వేంకటేశ్వర స్వామి ఆలయ పక్క వీధిలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ ను పరిశీలించారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు, ఎలక్ట్రిక్ పోల్ రోడ్డుకు అడ్డుగా ఉందని సానికులు తెలప డంతో సంబంధిత జీహెచ్ఎంసీ ఆధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివిజన్ లోని ప్రజలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *