డిబిపి మేనిఫెస్టో విడుదల చేసిన వడ్లమూరి కృష్ణస్వరూప్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 :  దళిత బహుజన పార్టీ(డిబిపి) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం హిమాయత్‌నగర్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరప్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ దళిత జాతులను ఎస్సీ, ఎస్టీ, బీసీల వర్గం నుండి సీఎం పదవిని సాధించడం, ప్రజలందరికి ఉచితంగా విద్యా, వైద్యం, ఇండియా దేశ రాజ్యాంగం, చట్టాలను ఖచ్చితంగా అమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గం నకు అన్ని జీవన, సామాజిక రంగాలలో సోషల్ జస్టిస్ అమలు చేయడం, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా, మేధావుల హక్కులు అమలు, రక్షణ, పౌరులందరికి సామాజిక రక్షణ కల్పించడం, దళిత జాతులకు రక్షణ కల్పించడం, ఎస్సీ, ఎస్టీ, చట్టం 1989 ను పటిష్టంగా అమలు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించడం, వ్యవసాయం, పారిశ్రామిక, పర్యావరణ రంగాలను అభివృద్ధి చేయడం, పౌరులందరికి విద్యా, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమ, రక్షణ, జీవన అవకాశాలను ఉచితంగా కల్పించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ ల శాతన్ని 80 శాతానికి పెంపుదల పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం సాధనకు కృషి చేయడం, భూమి లేని పేదలందరికి 2 ఎకరాల వ్యవసాయం భూమిని పంపిణీ చేయడం, భూ సంస్కరణ చట్టం ను ఖచ్చితంగా అమలు చేయడం, సొంత ఇల్లు లేని కుటుంబం నకు 5 సెంటుల ఇంటి స్థలం లో గృహ నిర్మాణం ను ఉచితంగా నిర్మించడం, నిరుద్యోగులకు ఉపాధి. ఉద్యోగం కల్పన, విద్యా, వైద్యం, ఆరోగ్య రంగాలకు 50 శాతం నిధులు బడ్జెట్ లో కేటాయించడం, తెలంగాణలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్, కోర్టుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపైన కఠిన చర్యలు తీసికోవడం తదితర అంశాలు పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ ఎన్నికల కమిటీ అధ్యక్షులు డాక్టర్ విఎల్ రాజు, డిప్యూటీ చైర్మన్ జెఎన్ రాజు, కో-ఆర్డినేటర్స్ దేవునూరి శ్రీనివాసు, బీరం సతీష్ కుమార్, ఎన్నికల కమిటీ సభ్యులు ఎండి హుస్సేన్, పల్లవి సాంబయ్య వడ్డెర, నక్కా రాజేందర్ రావు, గంధం శంకర్, మద్దెల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *