హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : దళిత బహుజన పార్టీ(డిబిపి) గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్యను నియమించారు. సనత్ నగర్ కు చెందిన మహిళా నాయకురాలు బండారి లావణ్యకు నియామకపు పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. గ్రేటర్ లో పౌర సమాజం ఎదుర్కొంటున్న పలు జీవన సమస్యలు పరిష్కారం కోసం నగరంలో దళిత బహుజన మహిళా హక్కులు, రక్షణ కోసం రామాబాయి అంబేద్కర్ స్ఫూర్తితో బలమైన పోరాటం చేస్తారని ఆశభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్, గ్రేటర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పరి సుబ్బారావు, పార్టీ నాయకులు రఘు నాధ్ ముదిరాజ్, డిబిపి ఆఫీస్ మేనేజర్ పెండ్యాల సుచంద్ర తదితరులు పాల్గొన్నారు.
డిబిపి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్య



