హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ప్రకటించడంపై మంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. అది డిక్లరేషన్ సభ కాదని..కాంగ్రెస్ ఫ్రస్టేషన్ సభ అంటూ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వొచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీల, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే అందుకు ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ…అది డిక్లరేషన్ సభ కాదు…అధికారం రానే రాదనే…కాంగ్రెస్ ఫ్రస్టేషన్ సభ అంటూ మండిపడ్డారు. కర్ణాటకలో కనీసం రేషన్..ఇవ్వలేని కాంగ్రెస్. తెలంగాణకొచ్చి డిక్లరేషన్..ఇస్తే నమ్మేదెవరని అన్నారు.
గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు. వి• 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది. చైతన్యానికి ప్రతీకైన తెలంగాణ ప్రజలకు తెలుసు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట.. విజన్ లేని కాంగ్రెస్.. డజన్ హావి•లు.. గాలీలో దీపాలే. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. దళిత, గిరిజన బిడ్డలకు కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. కర్ణాటకలో నమ్మి వోటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే ఎబిలిటీ లేదు. ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే దేశానికే ఓ పరిపాలనా పాఠం. ఇచ్చిన ఒక్క హావి• కూడా నెరవేర్చని పార్టీ వి•ది. ఇవ్వని హావి•లెన్నో అమలు చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదు. కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు.. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే‘ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.




