ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సమితి, ఆంధ్ర ప్రదేశ్ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మిక కార్యక్రమంలో డా. పులివర్తి కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. పులివర్తి ‘ప్రజాతంత్ర’కు ఆదినుండీ పలు శీర్షికలకు, సుదీర్ఘ కాలంగా తమ కలాన్ని అందించారు. సాంసృతికం, ఆధ్యాత్మికం, ధారావాహికాలుగా రామాయణం, మహాభా రతం, సాయి షట్చరిత్ర వంటి ఎన్నో ప్రముఖ పురాణ విషయాలపై రాశారు.
డా. పులివర్తి కృష్ణమూర్తికి తెలుగు భాష సేవారత్న పురస్కారం





