డాక్టర్లు అవిశ్రాంత సేవకులు

డాక్టర్స్ ‌డే సందర్భంగా గవర్నర్‌ ‌తమిళి సై శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జూలై 1 ’నేషనల్‌ ‌డాక్టర్స్ ‌డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్‌ ‌డాక్టర్ల సేవలను కొనియాడారు. కోవిడ్‌-19 ‌సమయంలో ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్లుగా డాక్టర్లు అందించిన సేవలను మరువలేమని చెప్పారు. ఎంతో రిస్క్ ‌తీసుకుని కోవిడ్‌ ‌రోగులను కాపాడేందుకు వారు పని చేశారని అన్నారు.

అదే కమిట్‌ ‌మెంట్‌ ‌తో డాక్టర్లు తమ వ’త్తిలో పునరంకితం కావాలని అన్నారు. ప్రతి సంవత్సరం జూలై1న డాక్టర్స్ ‌డే గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్‌ ‌రెండో ముఖ్యమంత్రి డాక్టర్‌ ‌బిధన్‌ ‌చంద్ర రాయ్‌ ‌వర్ధంతి,జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. ప్రాణాలను కాపాడే డాక్టర్లను స్మరించుకోవడం, వారి సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *