డబ్బులపై ఆశతోనే దొంగతనం .. సీసీ కెమెరాల ద్వారా కేసును చేదించిన పోలీసులు

– ఇద్దరు నిద్దతుల రిమాండ్ మరో ముగ్గురికై పోలీసుల వేట
– కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి

తాండూరు ప్రజాతంత్ర జులై 19 : డబ్బులపై ఆశతోనే ఓ ఇద్దరు వ్యక్తులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తెలిసిన ఓ ఇంటిలోనే దొంగతనాన్నికి పాల్పడ్డారు. ఈ ఈ భారీ చివరి సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈనెల 15న చోటుచేసుకుంది. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు చాకచక్యంగా వ్యవహరించి కేవలం మూడు రోజుల్లోనే భారీ చోరీ కేసును చేపించారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అల్గారి మజీద్ సమీపంలోని ఆర్టీఐ కన్సల్టెంట్ వాజీద్ ఈనెల 13న హైదరాబాద్లో జరిగిన వివాహానికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూసే సరికి ఇంట్లోని బీరువాలో సుమారు రూ. 20 లక్షలు చోరీ అయ్యాయి. దీంతో వాజిద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా పట్టణానికి చెందిన అబ్బుకార్ ఖురేషీ (21) గతంలో వాజిద్ దగ్గర అబ్బుకార్ కొన్ని రోజులు పనిచేశాడు. వాజిద్ దగ్గర ఫ్లాట్ అమ్మిన డబ్బులు సుమారు రూ.20లక్షలకు పైగా ఉన్నట్లు తెలుసుకున్న అబ్బుబొకార్ ఎట్లాగైనా డబ్బులు దొంగించాలని ఉద్దేశంతో తన పెద్దమ్మ కుమారుడు అబిసోఫియాన్ (25)తో కలిసి పక్క ప్లాన్ వేశారు. వీరితోపాటు మరో ముగ్గురు ఎండి ఖలీల్, పాత తాండూరుకు చెందిన తౌసిఫ్, ఇందిరమ్మ కాలనీకి దారుమళ్ల దీపక్ అలియాస్ కిట్టులను కలుపుకున్నారు. ఈనెల 13న వాజిద్ పెళ్లి కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలుసుకున్నారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం అదేరోజు రాత్రి 7 గంటలకు వాజిద్ ఇంటి ప్రాంతంలో రిక్కీ నిర్వహించి మళ్లీ రాత్రి 11 గంటల తరువాత అబుబకార్, ఖలీల్ లు హీరో హోండా ఫ్యాషన్ ప్రో(ఎపీ 28 ఎఎక్స్ 8265)బైకు ఇంటి వద్దకు వచ్చి తమ దగ్గర ఓ ఇనుప రాడ్ ను వెంట తెచ్చుకున్నారు. ఇంటి వెనుక నుంచి వెళ్లి రాడ్ సాయంతో ఇళ్లు తెరిచి లోపలికి వెళ్లారు. బీరువా తాళాలు అక్కడే ఉండడంతో దానిని తెరిచి అందులోని డబ్బులను ఎత్తుకుని రాడ్ తో సహా అక్కడి నుంచి పరారీ అయినట్లు తెలిపారు. ఆటోలో ఉన్న తౌసిఫ్, సోఫియాస్, కిట్టులు రాయల్ కాంట నుంచి రాగా బైకుపై అబ్బుకార్, ఖలీల్ లు పాత తాండూరు మాణిక్ నగర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని, అక్కడి నుంచి పట్టణంలోని యాదిరెడ్డి చౌరస్తా సమీపంలో ఉన్న పాత బడిన 365 హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇంట్లో నుంచి తీసుకవచ్చిన 500 నోట్లతో ఉన్న 40 కట్టలను లెక్కించి రూ. 20 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నుంచి రూ. 1లక్ష తీసుకుని రూ. 20 వేల చొప్పున అందరు పంచుకున్నారు. మిగతా రూ. 19 లక్షలను అక్కడే ఉన్న చెత్త డబ్బాలో దాచి ఆటో, బైకులతో పాటు చోరీకి ఉపయోగించిన ఇనుప రాడ్ తో పరారయ్యారు. వాజిద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలలో ఇంటి పరిసరాల వద్ద అసునామాస్పదంగా కనిపించిన అబుబకార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయాన్ని అంగీకరించాడు. చోరీ జరిగిన రోజు 365 హోటల్ వద్ద కలుసుకోవడం, డబ్బులు దాచి పారిపోవడం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు అబుబకార్, అబు సోఫియాన్ లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా వారిలో ఎండీ ఖలీల్, తౌసిఫ్, కిట్టులు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అబుబకార్, సోఫియాన్ లపై ఎలాంటి కేసులు లేవని, మిగతా ముగ్గురిపై అల్లర్ల కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ తెరుస్తామన్నారు. అదేవిధంగా 72 గంటల్లో కేసును చేధించిన తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డిలను అభినందించారు. కేసు చేధనలో చాకచక్యంగా పనిచేసిన పోలీస్ కానిస్టేబుళ్లు అంజద్, శివ, షబ్బీర్, సాయిప్పలకు ఎస్పీ చేతుల మీదుగా క్యాష్ రివార్డులను అందజేశారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఇతరుల సహాకారంతో పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణ కోసం అందరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *