డబ్బులతో రాష్ట్రంపై బిజెపి దాడికి వొస్తుంది

‌మునుగోడు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 : ‌డబ్బులతో రాష్ట్రంపై దాడి చేయడానికి బీజేపీ వొస్త్తున్నదని, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారం, డబ్బు, మద్యంతో మునుగోడు ప్రజలను కొనాలని చూస్తుందని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం మునుగోడులో కాంగ్రెస్‌ ‌బూత్‌ ‌స్థాయి ఇన్‌ఛార్జ్‌లతో భట్టి విక్రమార్క  భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మునుగోడు ప్రజలు డబ్బుకు లొంగరని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై అడుగులు వేస్తూ.. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రతి గడపకు పరిచయమని తెలిపారు. మునుగోడు ప్రజలు వేసే వోటు మీదే రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి స్టార్‌ ‌క్యాంపెయినర్‌ ‌కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *