- అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడాలి
- బిజెపి, మోడీ తీరుపై మండిపడ్డ మంత్రులు
- రాష్ట్ర రెడ్కో చైర్మన్గా సతీష్ రెడ్డి బాధ్యతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతుందని రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ తదితరులు ఆరోపించారు. దమ్ముంటే తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశంలో ఎక్కడైనా ఉందా చూపాలని బిజెపి, ప్రధాన మంత్రి మోడీకిసవాల్ విసిరారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే, బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని వారు విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన వై.సతీష్ రెడ్డి శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు మాట్లాడుతూ, వాట్సాప్ యూనివర్సిటీల కేంద్రంగా బిజెపి అసత్య ప్రచారాలకు దిగుతోందని పేర్కొన్నారు. అటువంటి అసత్యాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి వి•ద ఉందని చెప్పారు. గుజరాత్ నమూనాను చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి అదే గుజరాత్ ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు.
వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్ ఇవ్వకపోగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన అంశాన్ని మంత్రులు గుర్తుచేశారు. యావత్ భారతదేశంలో చీకట్లు అలుముకున్న రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా లో వెలుగులు నింపిందన్నారు.అటువంటి నాయకుడి నేతృత్వంలో జరిగిన తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు. శత్రు దుర్బేద్యమైన కోటగా టిఆర్ఎస్ రూపుదిద్దుకుందని వారు తెలిపారు. నిర్మాణాత్మక మైనపార్టీగా ప్రజల నుండి అనూహ్య మైన ఆదరణ టిఆర్ఎస్కు లభిస్తుందన్నారు. సభ్యత్వ నమోదు కోసం ప్రజలు బారులు తీరడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనమే ఇందుకు కారణంగా నిలుస్తుందన్నారు.
టీఆరెస్ లా పని చేస్తున్న పార్టీలు దేశంలో లేవు. ఉద్యమ నేత పర్భుత్వ అధినేత కావడం మన అదృష్టం. కరెంటు, సాగు, తాగు నీరు, అనేక పథకాలు సీఎం చేపట్టారని అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను, రోడ్లు, మురుగునీటి కాలువలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ, నాకు నా జీవితంలో ఇంత పెద్ద రోజు లేదు. నాకు దైవ సమానులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇచ్చిన ఈ అవకాశం ఇది. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. కార్యకర్త లాగే పని చేస్తాను. ఉద్యమం, సోషల్ వి•డియా కారణంగానే సీఎం నన్ను గుర్తించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సోషల్ వి•డియా యువకులు, పార్టీ నేతలు, అభిమానులు, సతీశ్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



