ట్రాఫిక్‌ చక్రబంధంలో హయత్ నగర్ డివిజన్ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని స్థానికుల అభ్యర్థన

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నగర ప్రజలకు ట్రాఫిక్‌జామ్‌ నిత్యం నరకం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నగరజీవిని ట్రాఫిక్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకోవాల్సి వస్తున్నది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అభ్యర్థించారు. మంగళవారం హయత్ నగర్ డివిజన్ పరిధిలోని కమలనగర్ కాలనీ వాసుల కోరిక మేరకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాలనీవాసులు ఎర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. దానిలో బాగంగా రైతు బజార్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలిగించాలని స్థానికులు కోరారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలోనే రైతు బజార్ దగ్గర వ్యాపారం చేసుకునే వారిని, కాలనీ వాసులను పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చెన్నగొని శ్రీధర్ గౌడ్, మల్లీశ్వరి రెడ్డి, మాజీ అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, దీపావళి శ్రావణ్, సత్తిరెడ్డి, కాలనీ అధ్యక్షులు రాజ్ కిరణ్, జనరల్ సెక్రటరీ సుబ్బారావు, సభ్యులు టీ.వి.రావు, భారత్ సింగ్, జ్యోతి రెడ్డి, సత్యనారాయణ యాదవ్, గణేష్, అచ్యుత్ రామారావు, నాగమల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *