- ఉగ్రవాద సంస్థతో హంతకులకు సంబంధం
- దేశవ్యాప్త నిరసనలతో కేంద్రహోంశాఖ నిర్ణయం
- ఎన్‌ఐఎకు అప్పగిస్తూ హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు
- నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూ దిల్లీ, జూన్ 29 : ఉదయపూర్‌లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య ఘటన దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఔఎం)కు అప్పగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కన్హయ్య లాల్ తేలి దారుణ హత్య కేసు కేసులో అంతర్జాతీయ లింక్‌ల ప్రమేయాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అధికారులను కోరారు.దారుణమైన హత్యోదంతంపై రాష్ట్రంలో వ్యక్తమైన ఆగ్రహంతో పలు హింసాత్మక సంఘటనలు జరిగాయి.దీంతో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక నెల పాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉదయపూర్ నగరంలోని ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కర్ఫ్యూ విధించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
ఉదయ్‌పూర్ ఘటనపై ఇవాళ రాజస్థాన్ సీఎం సమావేశం కానున్నారు.ఉదయ్‌పూర్ హత్య ఘటనపై చర్చించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం మధ్యాహ్నం సమావేశం అయ్యారు. జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరగింది. పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ట్విట్టర్‌లో ఇలా రాశారు. ఉదయపూర్‌కు చెందిన కన్హయ్య లాల్‌కు నా నివాళులు అర్పిస్తున్నాను,అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని సువేందు పోస్టు పెట్టారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన టైలర్ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దర్జీ కన్హయ్యలాల్‌ను ఇద్దరు ఆగంతకులు కత్తితో దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల హస్తం ఉందా లేదా తేల్చేందుకు కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు.
నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయపూర్ హత్య కేసులో నిందితుడికి పాక్ ఆధారిత ఉగ్ర సంస్థతో సంబంధాలున్నాయని వెల్లడైంది. కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. మరొక వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా బెదిరించారు. జూన్ 17న రికార్డ్ చేసిన మూడో వీడియో మంగళవారం హత్య తర్వాత బయటపడింది. హత్య తర్వాత వెలువడిన వీడియోలలో కన్హయ్య లాల్ మృతదేహం అతని దుకాణం వెలుపల పేవ్‌మెంట్‌పై పడి ఉంది. నిందితులు ఖంజీపీర్‌లోని ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నారు. భిల్వారాకు చెందిన రియాజ్ ఖాన్జీపీర్ ఉదయపూర్‌లో అద్దెకు ఉండగా, గౌస్ రాజస్మాండ్‌లోని భీమాకు చెందినవాడు. వారి మూలాల ప్రకారం నిందితులు ఇద్దరూ పాకిస్తాన్‌లోని ఒక ముస్లిం ఛాందసవాద సంస్థ దావత్-ఎ-ఇస్లాతో సంబంధాలున్నాయి.




