•తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం కో-కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాస్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : తెలంగాణ రాష్ట్ర మెడికల్ కి జరుగుతున్న ఎన్నికల్లో ‘తెలంగాణ రాష్ట్ర వైద్యుల ఫోరం(టీఎస్ డిఎఫ్)’ ప్యానల్ ను గెలిపిస్తే వైద్య గంగంలో పెను మార్పులు తీసుకువచ్చి ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని టీఎస్ డిఎఫ్ కో-కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గట్టు శ్రీనివాసులుతో కలసి బ్యాలెట్ బ్రోచర్ విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో ఉన్న వైద్యులు పోస్ట్ ద్వారా తమ ఇంటికి వచ్చిన బ్యాలెట్ పూర్తి చేసి నవంబర్ 30 లోపు అంపాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ వైద్యుడు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని అన్నారు. తమను గెలిపిస్తే ఆధునిక వసతులతో నూతన టీఎస్ఎంసీ భవనాన్ని నిర్మిస్తామన్నారు. నఖీలి వైద్యుల(ఆర్ఎంపి, పిఎంపి) వ్యవస్థ లేకుండా అరికడతామని అన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తామని అన్నారు. మెడికల్ రిజిస్ట్రేషన్ ను సులభతరం అయ్యేలా కృషి చేస్తామని అన్నారు. ఈ ఫోరం సభ్యులందరూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డా.లింగం గౌడ్, డా. చీమ శ్రీనివాస్, డా.ఐలయ్య యాదవ్, డా.సి.ఆర్.కె ప్రసాద్, డా.ఆవుల మురళీధర్, డా.పి.సత్యనారాయణ, డా.గోంగూర వెంకటేశ్వర్లు, డా.ఉమాకాంత్, డా.చీకోటి సంతోష్, డా. మువ్వ రామారావు, డా.వసంత్ కుమార్ లు పోటీ చేస్తున్నట్లు తెలిపారు.




