టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుల రమేష్‌

‌వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టబోతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ప్రసాద్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని వికారాబాద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుల రమేష్‌ ‌బి ఆర్‌ ఎస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకులు నరోత్తం రెడ్డి అరుణ్‌ ‌కుమార్‌ ‌దీపు బిజెపి జిల్లా కిసాన్‌ ‌మోర్చా అధ్యక్షులు మైపాల్‌ ‌రెడ్డి బిజెపి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు రాఘవ నాయక్‌ ‌టిడిపికి చెందిన సీనియర్‌ ‌నాయకులు చేవెళ్ల పార్లమెంట్‌ ఇం‌చార్జ్ ‌సుభాష్‌ ‌యాదవ్‌ ‌పరిగి కి చెందిన సీనియర్‌ ‌నాయకులు బిజెపి టిడిపి లకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి బిఆర్‌ఎస్‌ ‌లపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పోయిందని నాయకుల్లో కూడా ఆ పార్టీ విధానాలు చేపడుతున్న వ్యతిరేక కార్యకలాపాలకు విసిగిపోయి పార్టీలో ఈమడలేక కాంగ్రెస్‌ ‌పార్టీలో భారీగా చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌ ‌పార్టీపై నమ్మకం విశ్వాసం ఏర్పడిందని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలు కాంగ్రెస్‌ ‌పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ ‌నెరవేర్చకుండా తీరని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు రైతులకు కేవలం రైతుబంధు ఇచ్చి అన్ని సబ్సిడీలను కొట్టివేశారని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా మని నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను తీరని మోసా నికి గురి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ లతో పాటు పేదల అభివృద్ధికి అవస రమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు కృషిచేసి గెలిపించాలన్నారు. పార్టీకి కట్టుబడి పని చేసే నాయకులకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *