టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల కుమ్మక్కు రాజకీయాలు

చీకటి ఒప్పందంలో భాగంగా పరస్పర విమర్శలు
ఉప ఎన్నిక వేళ వోట్ల కోసం కొత్తగా విద్యుత్‌ ‌బకాయిల లొల్లి
లిక్కర్‌ ‌కుంభకోణంలో కవిత ఇంటిపై సిబిఐ, ఇడి ఎందుకు దాడి చేయరు
మోడీతో కుమ్మక్కయి విమర్శలు చేస్తున్న గులాం నబీ ఆజాద్‌
‌వి•డియా సమావేశంలో మండిపడ్డ పిసిసి చీఫ్‌, ఎం‌పి రేవంత్‌, ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌టిఆర్‌ఎస్‌, ‌బిజెపి ప్రభుత్వాలపై రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేతలు, ఎంపీలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ, కేసీఆర్‌ ‌చీకటి ఒప్పందంలో భాగంగానే ఆయా పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉపఎన్నిక వేళ వోట్ల కోసం కొత్తగా విద్యుత్‌ ‌బకాయిల లొల్లిని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ ‌నేతలు విమర్శించారు. కవితపై సీబీఐ, ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న కాంగ్రెస్‌ ‌నేతలు  తెరాస, భాజపా ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మోటార్లకు వి•టర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు తెరాస ఎంపీలు సభకే హాజరుకాలేదని రేవంత్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చెల్లించిన డబ్బును పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ ‌ఖర్చు చేస్తున్నారన్నారు.

సెప్టెంబర్‌ 1 ‌నుంచి మునుగోడులో క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కవిత వి•ద బీజేపీ ఎంపీలు లిక్కర్‌ ‌స్కామ్‌ ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ, ఈడీ మరి ఆమె ఇంటికి ఎందుకు వెళ్లడం లేదు. అంతటా దాడులు చేస్తున్న సిబిఐ కవిత ఇంటిపై ఎందుకు చేయడం లేదన్నారు. భాజపా బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేసి ప్రొటెక్షన్‌ ‌మనీ సంపాదిస్తుంది. రాహుల్‌ ‌పాద యాత్ర చేస్తున్నారు.. మోదీ మోకాళ్ల యాత్ర చేస్తారా అన్నారా అని, బంగాల్‌ ‌మోడల్‌ ఇక్కడ అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ ‌ముక్త్ ‌భారత్‌ ‌పేరుతో తెరాస, భాజపా డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బండి పాద యాత్ర వల్ల ప్రజలకు వొచ్చే ఉపయోగం లేదు. ఆయనకు మోకాళ్ల చిప్పలు అరుగుతాయి. ఉపఎన్నికల ముంగిట విద్యుత్‌ ‌బకాయిల పేరిట తీట పంచాయితీ తెచ్చారు. ఆగస్టు 8న మోటార్లకు వి•టర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. చీకటి ఒప్పందం కారణంగా తెరాస ఎంపీలెవరూ పార్లమెంటుకు రాలేదు. ఉభయకుశలోపరి మాదిరిగా భాజపా-తెరాస ఒకరినొకరు తిట్టుకుంటున్నారని రేవంత్‌ అన్నారు. గులాం నబీ ఆజాద్‌కు 50 ఏళ్ల అనుభవం ఉంది. కాంగ్రెస్‌ ‌నుంచి అత్యధిక బెనిఫిట్‌ ‌పొందిన వ్యక్తి ఆజాద్‌. ‌రాజ్యసభ పొడిగించలేదని ఆజాద్‌ ఇలా మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబంపై ఆయన చేస్తున్న వ్యాఖలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మోడీతో కుమ్మక్కు అయిన ఆజాద్‌ ఇలా కాంగ్రెస్‌పై విమర్వలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాలరెడ్డి రాజీనామాతో మునుగోడుకు పైసా ఉపయోగం జరగగలేదని, కానీ ఛోటామోటా నేతల కొనుగోళ్లతో డబ్బులు చేతులు మారుతున్నాయని ఈ విషయంలో టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ రెండూ ఒకటే అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. సాగునీటి విషయంలో పాలమూరును కేంద్ర రాష్ట్రాలు మోసం చేశాయని విమర్శించారు. మునుగోడులో సమస్యలపై చర్చకు రాకుండా డైవర్ట్ ‌పాలిటిక్స్ ‌చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని..కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్‌ ‌పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో భూములు కొల్లగొట్టేందుకు  రాష్ట్ర సర్కారు కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

మాజీ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తదితరులతో కలసి  రేవంత్‌ ‌రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్‌ ‌పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడి రైతుల సమస్యలను పట్టించుకోని సీఎం..ఇతర రాష్ట్రాల రైతులకు పరిహారం ఇస్తారని చెప్పారు. రాష్ట్రం అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు.  ఈ సమస్యలు పట్టించుకోని కేసీఆర్‌..‌బిహార్‌లో కార్మికులకు సాయం  చేస్తారా అని ప్రశ్నించారు. ఇక్కడే దిక్కులేదు..దేశమంతా తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారా అని ఎద్దేశా చేశారు. మన కార్మికులు, రైతులు, జవాన్లను పట్టించుకోకుండా..కేసీఆర్‌ ‌గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మోడల్‌ అం‌టే టెండర్లు ఇచ్చుడు.. కవి•షన్లు గుంజుడేనా అని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. ఇదిలావుంటే మునుగోడు అభ్యర్థి విషయంలో పీసీసీ ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపామని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. అభ్యర్థిని ఏఐసీసీ ఫైనల్‌ ‌చేస్తుందని చెప్పారు. అందరు కలిసి కట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. గులాం నబీ ఆజాద్‌కి 50ఏళ్ళ అనుభవం ఉందని..రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించలేదని అసంతృప్తితోనే మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గాంధీ కుటుంబంపై చేస్తున్న వ్యాఖలను ఖండిస్తున్నామన్నారు. మతకల్లోలాలను రెచ్చగొట్టడానికే రాజాసింగ్‌ ‌మాటలు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. బిజెపి రాజాసింగ్‌ను ఆయుధంగా వాడుతుందని ఆరోపించారు. రాజాసింగ్‌ ‌శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్‌ ‌రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.  ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు చేసి ఆయన్ని శిక్షించాలన్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ, ఈడీ ఎంక్వయిరీ వేయాలని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. 8 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బిజెపి ఏం చేస్తుందని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హావి•లను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హావి•లను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్లు విఫలమయ్యాయి. కాజీపేట్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ, ట్రైబల్‌ ‌యూనివర్సిటీపై కూడా పార్లమెంట్‌లో అడిగితే మాటేలేదని ఉత్తమ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *