టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం తరిమికొడదాం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 24 : టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమాన్ని  కాంగ్రెస్ ప్రారంభించింది.ఈసి చంద్రశేఖర్ గౌడ్ (మామ) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లోయపల్లి నుండి ప్రారంభమై చెన్నారెడ్డి గూడ వరకు కార్యక్రమం జరిగింది. బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ “తిరగబడుదాం తరిమికొడదాం” అనే కార్యక్రమం ద్వారా బిఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ఎండగట్టడంతో పాటు తమ సమస్యలను బిఆర్ఎస్ పాలకుల అన్యాయాలను వివరించేందుకు ప్రజలకు ఒక వేదిక ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని చంద్రశేఖర్ తెలిపారు.దాదాపు 15 లక్షలకు పైగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు 12 వేల  గ్రామాల్లో 3 వేల  డివిజన్ స్థాయిలలో ప్రజలతో సమావేశాలు నిర్వహించడం జరిగిందని,దీంతోపాటు మార్పు తీసుకురావలనే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకు వెళ్లి 75 లక్షల కుటుంబాలను కలుసుకుంటారు.చార్జ్ సీట్ విడుదల,పోస్ట్ కార్డ్,మిస్డ్ కాల్ నెంబర్,పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనునట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్,బిజెపి ప్రభుత్వాల వైపల్యాలపై చార్జ్ సీటు విడుదల చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అసమర్ధ పాలన, అన్యాయాలను ఈ చార్జ్ సీట్లో పొందుపరచనున్నామన్నారు.బిఆర్ఎస్ పాలనలో ప్రజల ఇబ్బందులుపరిపాలన వైఫల్యాలకు ఎస్ఆర్సి నిదర్శనంగా మారిందని తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాల ప్రజలను “తిరగబడతాం తరిమికొడదాం* పోస్ట్ కార్డ్ మరియు మిస్ కాల్ కార్యక్రమంలో భాగ్య స్వాములు కావాల్సిందిగా కోరుతున్నామని ఆయన కోరారు.ప్రతి పోస్ట్ కార్డ్ ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల ఉన్న  అసమర్ధృతిని సూచిస్తుంది.ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ 761899899 ఫోన్ మిస్ కాల్ ప్రోగ్రాంతో రూపొందించామని తెలిపారు.ఈకార్యక్రమంలో టిపిసిసి హ్యూమన్ రైట్స్ ఆర్టిఐ కన్వీనర్ త్యాళ్లపల్లి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నాయకుడు,ముత్యాల శ్రీహరి,శివ గౌడ్ నాయినంపల్లి బుగ్గ రాములు ఆరుట్ల ప్రసాద్ ఆర్ పరమేష్, జంగయ్య,బండలేమురు ఉప్పసర్పంచ సత్యం మాజీ సర్పంచ్ మోతిలాం నాయక్,లోయపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,లోయపల్లి పార్టీ ప్రెసిడెంట్,యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నందకిషోర్ తమ్మల్ల కృష్ణ,మరుపు స్వామి,  బత్తుల బాలు చర్ల పటేల్ గూడ,బడుగు ప్రసాద్,బి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *