ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ అన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణ పర్యాటక కేంద్ర నోడల్ ఏజెన్సీ సెప్టెంబర్ లో జనగామ జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేటలోని చంద్లాపూర్ గ్రామాలను ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామాలుగా గుర్తించిన సందర్భంగా ఎల్.ఎన్.ధనంజయ్య, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ శ్రీరామ్ రాజ్ తదితర సామాజిక కార్యకర్తలతో పాటు పెంబర్తి గ్రామాన్ని సందర్శించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కళాకారులను కలుసుకుని కళలు, వాటి గురించి చర్చించి, కళాకారులను సత్కరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ డైరెక్టర్ కె.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జ్ఞాపిక అనగానే పెంబర్తి మెమెంటోలు గుర్తొస్తాయి





