జోడో యాత్రతో మళ్లీ ప్రజలకు చేరువవుతున్నాం: కేంద్ర మాజీ మంత్రి జైరామ్‌ ‌రమేశ్‌

కాంగ్రెస్‌ ‌పార్టీ నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర తాము మర్చిపోయిన ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని గుర్తు చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత జైరాం రమేష్‌ ‌తెలిపారు. మేం అధికారంలో ఉన్నప్పుడే ఇంటింటి పరిచయ కార్యక్రమాన్ని మర్చిపోయాం.. కానీ ఇప్పుడు భారత్‌ ‌జోడో యాత్ర ఆ విషయాలన్నీ గుర్తు చేస్తోందని అన్నారు. భారత్‌ ‌జోడో యాత్ర ఓటు బ్యాంక్‌ ‌కోసం చేయడం లేదని జైరాం రమేష్‌ ‌పేర్కొన్నారు.

రాహుల్‌ ‌గాంధీ రాజకీయాలకు అతీతంగా భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. దేశ ప్రజల్లో సమైక్యతను పెంపొందించడానికి రాహుల్‌ ‌గాంధీ కృషి చేస్తున్నారని జైరాం రమేష్‌ ‌తెలిపారు. ఈ యాత్రతో మళ్లీ కాంగ్రెస్‌ ‌పునరుజ్జీవానికి బాటలు పడుతున్నాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ ‌పాలనను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. అలాగే బిజెపికి చెమటలు పడుతున్నాయని అన్నారు. మోడీ వైఫల్యాలను ప్రజలు గుర్తించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *