జైపాల్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు మున్సిపాలిటీ 5వ వార్డు నవచైతన్య కాలనీలో  కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గుర్క జైపాల్ యాదవ్ కుమార్తెలు సంగీత, జ్యోతి, వాణిల ఆధ్వర్యంలో ప్రచారాన్ని ఉదృతం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా పథకాలను గడపగడపకు వెళ్లి వివరించారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్య నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్, నాయకులు జంతుక అలివేలు, కిరణ్, ఉప్పల రాములు, కోటశ్రీను, డేరంగుల వెంకటేష్, రమేష్ నాయక్, లండం యాదయ్య, వడ్డెమోని శివకుమార్, చలిచీమల సతీష్, ఏనుమల్ల రమేష్, సాయులు, మైసయ్య, వెంకటయ్య, రాములు, యాదయ్య, జంతుక శివ, ఏకుల కార్తీక్, గణేష్, కృష్ణ, వినయ్, రాఘవేందర్, శ్రీరామ్ భరత్, చింటూ, శివ, శేఖర్, పురుషోత్తం, దేవేందర్, మహేష్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *