జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ పోటీలో  సిల్వర్ మెడల్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పెద్ద కుమారుడు అభిషేక్‌గౌడ్‌ కొడుకు  మహదేవ్‌ గౌడ్‌ హర్యానాలో ఈనెల 8 నుంచి 11 వరకూ జరిగిన సబ్‌ జూనియర్‌ నేషనల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు.హర్యానా ఎంపీ భూషణ్‌ శరణ్‌సింగ్‌ చేతుల మీదుగా  మహదేవగౌడ్‌ గ్రాప్లింగ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ దీపక్ కపూర్ రజత పకతం అందుకున్నాడు. ఈ సందర్భంగా నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తన మనవడు రెజ్టింగ్ లో సిల్వర్ మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.మరిన్ని విజయాలు సాధించి పటాన్ చెరు నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *