జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం
సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న ఎలక్షన్ కేసులు,(అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఎసిపి, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకొని, (యస్ఓపి) ప్రకారం సిడి ఫైళ్ళల్లో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉందో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ…. ఫ్రీ ఇన్సిడెంట్ ఎన్నికల నిర్వహించినందుకు పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించాలి, అమ్మే వారిపై నిఘా పెట్టి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సందర్భంగా నమోదైన కేసులను త్వరగా పరిశోధన చేసి డిస్పోజల్ చేయాలి, కోర్టులో పెండింగ్ గ్రేవ్ ట్రయల్ కేసులు డిస్పోజల్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలి. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు. ఐటి యాక్ట్ కేసులు త్వరగా డిస్పోజల్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి సీడీ ఫైల్ లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు. సంబంధిత ఏసీపీ, సిఐలు, పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల సీడీ ఫైల్స్ ను ఎప్పుడు కప్పుడు పరిశీలించి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ గురించి ఎస్ఐలకు గైడ్ చేయాలని సూచించారు. ప్రతి నెల 15 నుండి 20 తేదీ లోపు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు. సీసీ నెంబర్లు పెండింగ్ ఉన్న కేసులలో సీసీ నెంబర్లు కోర్టు అధికారులతో మానిటర్ చేసి వెంటనే తీసుకోవాలని సూచించారు. పెండింగ్ నాన్ బేలబుల్ వారెంట్స్ పై రివ్యూ నిర్వహించి వారి యొక్క అడ్రస్ కనుక్కొని ఎగ్జిక్యూటివ్ చేయాలని సూచించారు. పెండింగ్ ఉన్న దొంగతనాల కేసులను అన్ని కోణాలలో పరిశోధన చేసి త్వరగా చేదించాలని సూచించారు. టార్గెట్ పెట్టుకొని పెండింగ్ ఉన్న కేసులను తగ్గించాలన్నారు. అరెస్టు పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసుల్లో వెంటనే నిందితులను అరెస్టు చేయాలని సూచించారు. దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ఫోక్సో, ఎస్సీఎస్టీ కేసులు, దొంగతనాల కేసులను త్వరగా ఛేదించాలి, 5s ఇంప్లిమెంటేషన్ పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అందరూ కృషి చేయాలి. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలని సూచించారు. సిసిటియన్ యస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్ లో ప్రతి రోజు ఎంటర్ చేయలని ఆదేశించారు. ప్రతిరోజు ఏసీపీ సీఐలు మానిటర్ చేయాలని సూచించారు. పడిపోయిన దొంగలించబడిన సెల్ఫోన్లు సిఈఐ ఆర్ సాఫ్ట్వేర్ ద్వారా కనిపెట్టి త్వరగా రికవరీ చేసి బాధ్యతలకు అప్పగించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గురించి, గంజాయి, డ్రగ్స్ సమూలంగా నిర్మూలించడానికి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ అందె శ్రీనివాసరావు, ఎసిపిలు సతీష్, రమేష్, సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, సిఐలు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.




