సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు టీఎన్జీవో సంఘం తరపున టీఎన్జీవో అధ్యక్షుడు ఎం.డి.జావిద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎస్పీ సిహెచ్ రూపేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2024 డైరీ ముద్రణ కోసం యస్.పి సందేశాన్ని కోరారు. జిల్లాలో ఉన్నటువంటి టీఎన్జీవోస్ భవనాలను, టీఎన్జీవోస్ ఆస్తులను కాపాడాల్సిందిగా కోరిన వెంటనే యస్.పి సంగారెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆ సంఘం అధ్యక్షుడు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి వి.రవి గారు అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, పి.వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కేంద్ర సంఘం మహిళా కార్యదర్శి నిర్మలా రాజకుమారి, కేంద్ర సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాజా గౌస్ హష్మీ , విజయ్, శ్రీనివాస్, కొండల్, సుధామణి తదితరులు పాల్గొన్నారు




