జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్సంగారెడ్డి

సంగారెడ్డి, ,ప్రజాతంత్ర,డిసెంబర్ 14: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాస్థాయిలో దివ్యాంగుల క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో దివ్యాంగులకు జిల్లాస్థాయిలో  క్రీడా పోటీల నిర్వహణపై మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీలను సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పోటీలలో ఐదు గేమ్స్ నిర్వహించ
నున్నట్లు తెలిపారు.  జూనియర్ ,సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయన్నారు. జూనియర్ కేటగిరీలో 10 నుండి 16 సంవత్సరాల వయస్సు వారు, సీనియర్ కేటగిరిలో 17 సంవత్సరాలు, ఆ పై వయస్కులు(బదిరులు, అంధులు, శారీరక, మానసిక వైకల్యంగల దివ్యాంగ మహిళలు, పురుషులు)  పాల్గొనవచ్చని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన స్పోర్ట్స్ మెటీరియల్ అందించడంతోపాటు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా యువజన, క్రీడల అధికారి రామ్ చందర్ రావుకు సూచించారు.ఈ క్రీడా పోటీలలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య,పట్టణ, మండల వికలాంగుల సమాఖ్య, జిల్లా సమాఖ్యల సహకారంతో ఆయా సంఘాలలోని దివ్యాంగులు క్రీడా పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పిడి  శ్రీనివాసరావుకు, మెప్మా పీడీ గీతకు సూచించారు. 10-16 సంవత్సరాల వయస్సు గల దివ్యాంగులైన పాఠశాల విద్యార్థులను ఈ క్రీడా పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించాలని, క్రీడా పోటీల నిర్వహణకు
పి ఈ టి లను డిప్యూట్ చేయాలని విద్య శాఖ అధికారికి సూచించారు.
క్రీడా పోటీల నిర్వహణ రోజు సంబంధిత గ్రౌండ్లో డాక్టర్ తో పాటు మెడికల్ టీం ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు.
క్రీడా పోటీల నిర్వహణకు అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ లో పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయించాలని, తాగునీరు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.
సంబంధిత క్రీడా పోటీల నిర్వహణ షెడ్యూల్ ఖరారు చేసి ప్రణాళికతో క్రీడా పోటీలు నిర్వహించాలని, అదేవిధంగా క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు చేయాలని డి డబ్ల్యు ఓ కు సూచించారు. నెహ్రూ యువ కేంద్రం, డిగ్రీ కళాశాలల వారికి, యువజన సంఘాల వారికి క్రీడా పోటీల నిర్వహణ సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. క్రీడా పోటీలు సజావుగా విజయవంతంగా జరిగేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో డి డబ్ల్యూ ఓ సంధ్యారాణి, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, డిఇఓ వెంకటేశ్వర్లు, యువజన క్రీడల అధికారి రామచందర్ రావు, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గాయత్రీ దేవి, మెప్మా పీడీ గీత, మున్సిపల్ కమిషనర్ సుజాత, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *